సోమవారం 26 అక్టోబర్ 2020
Siddipet - Sep 26, 2020 , 02:08:48

అభివృద్ధికే పట్టం కట్టాలి

అభివృద్ధికే పట్టం కట్టాలి

  • సిద్దిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి

దుబ్బాక టౌన్‌ :  ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు డిపాజిట్‌ దక్కకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని 17వ వార్డు టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి, సిద్దిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో 17వ వార్డు కౌన్సిలర్‌ పులిగారి కల్పన ఎల్లం ఆధ్వర్యంలో ముస్లింలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో ముస్లింల కోసం హాజ్‌హౌస్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారని గుర్తు చేశారు. త్వరలో జరుగబోయే దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ముస్లింలు  టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. సమావేశంలో మైనార్టీ కమిటీ దుబ్బాక మండల అధ్యక్షుడు ఎండీ చాంద్‌మియా, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అక్బర్‌, స్థానిక నాయకులు ఖాదీర్‌, సల్మాన్‌, జమీర్‌, మజర్‌, ఇక్బాల్‌, షబ్బీర్‌, బాబా తదితరులు పాల్గొన్నారు.logo