గురువారం 22 అక్టోబర్ 2020
Siddipet - Sep 26, 2020 , 02:09:06

లక్ష ఓట్ల మెజార్టీయే.. టీఆర్‌ఎస్‌ లక్ష్యం

లక్ష ఓట్ల మెజార్టీయే.. టీఆర్‌ఎస్‌ లక్ష్యం

  • నర్సాపూర్‌ ఎమ్మెల్యే  మదన్‌రెడ్డి

చేగుంట : దుబ్బాక ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీయే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి, పోలంపల్లి, వడియారం, చేగుంట గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే పరటించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజన తండాలను  పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వనికే దక్కుతుందన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు  మేలు జరుగుతుందన్నారు. పేదలకు  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అండగా ఉండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రామలింగారెడ్డి మృతి నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. ‘ధరణి’ వెబ్‌సైట్‌ ద్వారా రైతులు రిజిస్టేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా తహసీల్‌ కార్యాలయంలో పట్టా మార్పిడి చేసుకోవచ్చు అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలిపించాలనిప్రజలను ఎమ్మెల్యే కోరారు.కార్యక్రమంలో వడ్డెపల్లి తిరుమల నర్సింహులు,ఎంపీటీసీలు రవి,అయిత వెంకటలక్ష్మి  ,బక్కిలక్ష్మీరమేష్‌, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ స్వామి, సొసైటీ చైర్మన్లు వంటరి కొండల్‌రెడ్డి, మ్యకల పరమేశ్‌ ఉన్నారు.

చిలిపిచెడ్‌లో.. ఎమ్మెల్యే ప్రచారం..

చిలిపిచెడ్‌ : దుబ్బాక ఎన్నికల ప్రచారంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పిలుపు మేరకు చిలిపిచెడ్‌ మండల టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ యూత్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి  మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికలో గులాబీ జెండా ఎగరుతుందన్నారు. కార్యక్రమం లో  మాజీ ఉమ్మడి కౌడిపల్లి జడ్పీటీసీ  రామాగౌడ్‌, మండల నాయకులు మాణిక్యరెడ్డి, ఎం.సీ విఠల్‌, గౌతాపూర్‌ మాజీ సర్పంచ్‌ బీమయ్య పాల్గొన్నారు.logo