మంగళవారం 27 అక్టోబర్ 2020
Siddipet - Sep 25, 2020 , 02:28:34

పేదల కల సాకారం

పేదల కల సాకారం

  • దౌల్తాబాద్‌ మండలం దీపాయంపల్లిలో సిద్ధమైన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు 
  • n త్వరలో ప్రారంభోత్సవం
  • n ఆనందంలో లబ్ధ్ధిదారులు

దౌల్తాబాద్‌ : నిలువ నీడలేని పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. దౌల్తాబాద్‌ మండలం దీపాయంపల్లి గ్రామ పంచాయతీలో పేదల ఇండ్ల కల సాకారం కానున్నది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహకారంతో గ్రామానికి 15 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో సకాలంలో ఈ ఇండ్ల నిర్మాణ పనులు పూర్త్తయ్యాయి. ఇండ్ల వద్ద సీసీరోడ్లు, విద్యుత్‌, కుళాయి కనెక్షన్లు,మురుగు కాలువలు వంటి మౌలిక వసతులు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు లబ్ధ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా పూర్తిచేశారు. ఇల్లు లేనివారిని, గుడిసెలో ఉన్నవారిని అర్హులుగా ఎంపిక చేశారు.దీంతో త్వరలోనే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభోత్సవం చేసి పేదలకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటాం..

మాది చానా బీద కుటుంబం. మాకు ఇల్లు లేక 15 ఏండ్లుగా గుడిసెలో ఉంటున్నం. సీఎం కేసీఆర్‌ సార్‌ మాకు ఇల్లు కట్టించిండ్రు. గిప్పుడు చాన సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సారు దేవుని లాంటోడు. చనిపోయిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి సార్‌ మాకు చానా మేలుజేసిండు.

- మాస్కురి యాదమ్మ, లబ్ధిదారు, దీపాయంపల్లి  

పేదలు సంతోషిస్తున్నారు..

మాగ్రామంలో చాలామందికి సొంతిండ్లు లేక గుడిసెలు, కిరాయి ఇండ్లలో ఉంటున్నారు.దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృషితో 15 బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సోలిపేట ప్రత్యేక చొరవ తీసుకుని సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయించారు. త్వరలో ప్రారంభోత్సవం చేయనుండడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల కోసం కృషిచేసిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబానికి రణపడి ఉంటాం.    - లావణ్య నర్సింహారెడ్డి, దీపాయంపల్లి గ్రామ సర్పంచ్‌


logo