మంగళవారం 27 అక్టోబర్ 2020
Siddipet - Sep 25, 2020 , 02:28:34

రైతు కదిలె.. ర్యాలీగా తరలె

రైతు కదిలె.. ర్యాలీగా తరలె

  • n రాయపోల్‌లో 200 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
  • n జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

రాయపోల్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ వందలాది ట్రాక్టర్‌లతో రైతన్నలు సంబురాలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని పెద్దఅరెపల్లి నుంచి మండల కేంద్రం రాయపోల్‌ వరకు భారీ ట్రాక్టర్‌ ర్యాలీని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టన్ని స్వాగతిస్తూ రైతులు జేజేలు పలికారు. దారి పొడవునా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా వందలాది మంది రైతులు ట్రాక్టర్‌లతో మందుకు సాగారు. ఐదు కిలో మీటర్ల వరకు సాగిన ఈ ర్యాలీ ఎంతో ఆకట్టుకున్నది. 

కేంద్రప్రభుత్వానికి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది  : మంత్రి హరీశ్‌రావు

రైతులకు పెద్దపీట వేయాల్సింది పోయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో 266 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మలతో కలిసి అందజేశారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద రైతులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని రంగాల్లో పెద్దపీట వేసిందన్నారు. వ్వయసాయ బాయిలు మరియు బోర్ల వద్ద మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తారని, మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని వద్దనుకుంటే సీఎం కేసీఆర్‌ కారు గుర్తుకు ఓటు చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మోజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, రైతుబంధు అధ్యక్షుడు నర్సింహ్మరెడ్డి. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, వైస్‌ ఎంపీపీ రాజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.


logo