శుక్రవారం 30 అక్టోబర్ 2020
Siddipet - Sep 24, 2020 , 01:39:10

సర్వమతాల సమదృష్టి : మంత్రి

సర్వమతాల సమదృష్టి : మంత్రి

దుబ్బాక టౌన్‌ : రాష్ట్రంలో అన్ని మతాలను సమ దృష్టితో, సమానత్వంతో చూసే పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ అని, ప్రజలకు టీఆర్‌ఎస్‌ పార్టీ పైన ఉన్న స్వతంత్రం మరో రాజకీయ పార్టీపై ఉండదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ క్రిస్టియన్‌ పాస్టర్ల సంఘం, కూడవెల్లి దేవస్థాన కల్యాణ మండపంలో రేషన్‌ డీలర్ల సమవేశం నిర్వహించారు. దీనికి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు హాజరై, మాట్లాడారు. 70ఏండ్లు రాష్ర్టాన్ని వివిధ రాజకీయ పార్టీలు పాలించినా, అన్ని మతాలను సమ దృష్టితో చూడలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాకే అన్ని మతాలకు, కులాలకు సమాన గౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని కొనియాడారు. యేటా క్రిస్మస్‌ పండుగను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5కోట్లతో రాష్ట్రంలో క్రిస్టియన్‌ భవనాన్ని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి క్రిస్టియన్లకు ఇచ్చిన మాట ప్రకారం సిద్దిపేట తరహాలో భవనాన్ని, పరలోక వాహనాన్ని త్వరలో సమకూరుస్తామన్నారు. పేద క్రైస్తవులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. రేషన్‌ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి సంపూర్ణ మద్దతును మంత్రి సమక్షంలో రేషన్‌ డీలర్లు ప్రకటించారు.

 బీజేపీ రైతు వ్యతిరేక  విధానాలను  ఎండగట్టాలి

బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ఎక్కడపడితే అక్కడా ఎండగట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ బోర్ల వద్ద మీట ర్లు బిగించడం, విదేశీ మొక్కజొన్నలు దిగుమతి చే యడం, వ్యవసాయ మార్కెట్‌ యార్డులను నిర్వీ ర్యం వంటి రైతు వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రభుత్వం రైతు నోట్లో మట్టి కొట్టుతుందన్నారు. ఇటువంటి బీజేపీకి దుబ్బాక నియోజకవర్గంలో ఎవ్వరైనా ఓట్లు వేస్తారని మంత్రి ప్రశ్నించారు.

గెట్ల పంచాయితీలు ఇక ఉండవు

చేగుంట: దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాని కోరుతున్నతని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం చేగుంటలోని సాయిబాలాజీ గార్డెన్‌లో చేగుంట, నార్సింగి మండలలాకు సంబంధించిన 400 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను, 25 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చేగుంట మండల ఇన్‌చార్జి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నార్సింగి మండల ఇన్‌చార్జి నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగి భూములు అమ్మిన, కొన్న మ్యుటేషన్‌ సమయంలో తహసీల్‌ కార్యాలయాల్లో అనేక ఇబ్బందులు ఉండేవని, ఇక నుంచి గెట్లకాడి పంచాయితీలు ఉండకుండా డిజటిల్‌ సంతకాలతో కూడిన పట్టదారు పాసు బుక్కులు పోస్టులో నాయా పైసా ఖర్చులేకుండా ఇంటింకే వస్తాయాన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో  ఇతర పార్టీలకు డిపాజిట్‌ దక్కకుండా చేయాలని మంత్రి  పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బోరు మోటర్లకు కరెంట్‌ మీటర్ల వద్దు అని సభ్యులు మాట్లాడితే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్లమెంట్‌ సమావేశం నుంచి బయటకు పంపించి బిల్లుపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, చేగుంట, నార్సింగి ఎంపీపీలు శ్రీనివాస్‌, సబిత, జడ్పీటీసీలు శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి ఉన్నారు.