గురువారం 29 అక్టోబర్ 2020
Siddipet - Sep 23, 2020 , 01:57:15

విత్తన భాండాగారాలుగా సీఎం దత్తత గ్రామాలు

విత్తన భాండాగారాలుగా సీఎం దత్తత గ్రామాలు

  • n ప్రజలకు విత్తనోత్పత్తి పై అవగాహన 
  • n రాష్ట్ర విత్తన కార్పొరేషన్‌ ఎండీ  డాక్టర్‌ కేశవులు

మర్కూక్‌: సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటను విత్తనోత్పత్తి గ్రామాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విత్తన కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ కేశవులు అన్నారు.  మండలంలోని సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలోని రైతులకు మంగళవారం యాసంగి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కేశవులు మా ట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లోని భూ ములు వరి, మొక్కజొన్న, శనగ పంటల విత్తన అభివృద్ధికి అనుకూలమన్నారు. రైతులందరూ విత్తనాభివృద్ధికి సామూహికంగా ముందుకు రా వాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ యాసంగి పంటల సాగులకు రెండు గ్రామాల్లో 800 ఎకరాల్లో వరి, మొ క్కజొన్న విత్తనోత్పత్తికి ప్రణాళికలు సిద్ధంగా చేశామన్నారు. విత్తనోత్పత్తికి రైతులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ అనిల్‌కుమార్‌, ఏవో నాగేందర్‌, ఏఈవో మశ్చేందర్‌, టీఎస్‌ఎస్‌డీసీ రీజినల్‌ మేనేజర్‌ లావణ్య, సర్పంచ్‌ భాగ్యభిక్షపతి, ఎంపీటీసీ ధనలక్ష్మి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ బాల్‌రాజు, రైతులున్నారు.

నేడు సీడ్‌ కంపెనీ యాజమాన్యాలతో మంత్రి సమావేశం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లాను విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సీడ్‌ కంపెనీ యాజమాన్యాలతో బుధవారం సమావేశం కానున్నారు. రంగనాయకసాగర్‌ గెస్ట్‌హౌస్‌ వేదికగా జరగనున్న సమావేశానికి ప్రముఖ సీడ్‌ కంపెనీల యాజమాన్యాలు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట జిల్లాలో భూగర్భ జలమట్టం భారీస్థాయిలో పెరుగడం, సమృద్ధిగా సాగుజలాల లభ్యత నేపథ్యంలో అస్యూర్డ్‌ సాగుపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సిద్దిపేట జిల్లాలో మారిన వ్యవసాయసాగు ముఖచిత్రం నేపథ్యంలో విత్తనోత్పత్తికి అన్నివిధాలా అనుకూలంగా ఉన్న దృష్ట్యా, రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంత్రి హరీశ్‌రావు ముందుకు సాగుతున్నారు. ప్రముఖ సీడ్‌ కంపెనీలు జిల్లాలో విత్తనోత్పత్తి చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదే అంశంపై సీడ్‌ కంపెనీల అధిపతులు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, వ్యవసాయ అధికారులు, ప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు చర్చించనున్నారు. సమావేశ ఏర్పాట్లను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.