మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 23, 2020 , 01:57:16

రైతుల కోసమే కొత్త రెవెన్యూ చట్టం

రైతుల కోసమే కొత్త రెవెన్యూ చట్టం

చేగుంట: రైతుల మేలు కోసమే సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం  మండలంలోని కరీంనగర్‌, సోమ్లాలోక్యా తండా, కుక్కల గుట్ట, రుక్మాపూర్‌, ఇబ్రహీంపూర్‌, అనంతసాగర్‌, ఉల్లితిమ్మాయిపల్లి, చిట్టోజిపల్లి, పోతాన్‌శెట్టిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఎమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కర్నాల్‌పల్లి ఎల్లమ్మ ఆలయంలోఎమెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లకు కార్యాలయాల చుట్టూ తిరుగకుండా తహసీల్‌ కార్యాలయంలో చేసుకోవచ్చన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో రైతుల ఇబ్బందులు తీరినట్లేనన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. రుక్మాపూర్‌, ఇబ్రహీంపూర్‌ గ్రామాల్లో ఫారెస్టు, రైతులకు సంబంధించి భూముల విషయంలో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి రైతులకు న్యాయం చేకూరేలా కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థిని లక్ష మోజార్టీతో గెలిపించుకోవాలని కోరారు.

టీఆర్‌ఎస్‌కే మా ఓటు.. 

- సోమ్లా,లోక్యా గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం..  

అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని మండలంలోని సోమ్లా, లోక్యా గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కొత్త పంచాయతీ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ఆయన చేసిన సేవలను మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, అయిలపురం రఘుపతి, కాశబోయిన భాస్కర్‌, రాములు, వెంకటేశంగారి లక్ష్మీసిద్ధిరాములు, నెల్లూర్‌, ఎంపీటీసీలు బింగి గణేశ్‌, బెదరబోయిన భాగ్యలక్ష్మీనాగభూషణం, గాండ్ల లతానందం, ఉప సర్పంచ్‌ మ్యాకల రామచంద్రం, ఇబ్రహీంపూర్‌ సొసైటీ చైర్మన్‌, వంటరి కొండల్‌రెడ్డి, పట్నం తానీషా, మైలరాం రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.logo