గురువారం 29 అక్టోబర్ 2020
Siddipet - Sep 22, 2020 , 02:16:58

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

 టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

  • టీఆర్‌ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ 

రాయపోల్‌ : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మహేశ్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్వీ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మహేశ్‌ వెంట టీఆర్‌ఎస్వీ నాయకులు శ్రీధర్‌, లక్ష్మాణ్‌, మురళి, గురుప్రసాద్‌ ఉన్నారు. 

రఘునందన్‌కు సమస్యలపై  అవగాహన లేదు.. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు తీపిరెడ్డి మహేశ్‌రెడ్డి

దుబ్బాక : బీజేపీ నాయకుడు రఘునందన్‌ రాజకీయాల్లో కాకుండా టీవీ యాంకర్‌గా బాగా పని చేస్తారని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకుడు తీపిరెడ్డి మహేశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం దుబ్బాక ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కొత్త పుష్పలతతో కలిసి మాట్లాడారు. రఘునందన్‌కు ప్రజా సమస్యలపై అవగాహన లేదని, కేవలం ఎన్నికల సమయంలోనే గ్రామాల్లోకి వస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్‌ లేదని, ఉన్న కొద్దిమంది టీఆర్‌ఎస్‌లో చేరారన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితమే పునారావృతం అవుతుందని జోస్యం పలికారు. logo