మంగళవారం 20 అక్టోబర్ 2020
Siddipet - Sep 21, 2020 , 00:03:43

టీఆర్‌ఎస్‌వైపే నియోజకవర్గ ప్రజలు

టీఆర్‌ఎస్‌వైపే నియోజకవర్గ ప్రజలు

దౌల్తాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఉన్నారని సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్వీ కో ఆర్డినేటర్‌ మేరుగు మహేశ్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని హైమద్‌నగర్‌, శౌరిపూర్‌, శేరిపల్లి, బందా రం, మల్లేశంపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్వీ జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్వీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. సంక్షేమ పథకాలను అందిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు.  హైమద్‌ నగర్‌, శౌరీపూర్‌ గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే తమ మద్దతని తీర్మానం చేసిన ప్రతిని మంత్రి హరీశ్‌రావుకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు ఖాలీలొద్దీన్‌, నాగరాజు రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లక్ష మెజార్టీ ఖాయం 

చేగుంట : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిని లక్ష మెజార్టీతో గెలుపించుకోవాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకులు బక్కి వెంకటయ్య అన్నారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు సురేశ్‌ ఆధ్వర్యంలో లింగన్న యాదిలో కార్యక్రమాన్ని ఆదివారం మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాల అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభించి, సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌లో రామలింగారెడ్డి సమాధి వరకు రెండు వందల మంది కార్యకర్తలతో పాదయాత్రను నిర్వహించారు. పాదయాత్రలో చేగుంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాస్‌ శ్రీనివాస్‌, చేగుంట, ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ రజనక్‌ప్రవీన్‌కుమార్‌, డెరెక్టర్‌ ఇమ్మడి లక్ష్మణ్‌, స్థానిక సర్పంచ్‌ బాలమలయ్య, ఎంపీటీసీ నవీన్‌, నాయకులు లచ్చిరెడి, తానీషా పాల్గొన్నారు. 
తొగుట : దుబ్బాక ఉపఎన్నికలో ప్రతిపక్షాలకు డిపాజిట్‌ కూడా దక్కదని అందోల్‌ ఎమ్మెల్యే తొగుట ఇన్‌చార్జి చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని వెంకట్‌రావుపేట, జప్తిలింగారెడ్డిపల్లి, లింగాపూర్‌, చందాపూర్‌, ఎల్‌ బంజేరుపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ గ్రామాన నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవీరవీందర్‌, జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నర్సింహులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కనకయ్య, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పోచయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచ్‌ బొడ్డు నర్సింహులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని గోవర్ధనగిరిలో సర్పంచ్‌ ఎల్లం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చేగుంట : తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి, పులగుట్ట తండా, నడిమితండా, వెనుకతండా, పెద్దశివునూర్‌, పోతాన్‌పల్లి, కసాన్‌పల్లి, చందాయిపేటలో ఆదివారం ఆయన పర్యటించారు. అనంతరం పోతాన్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని కోరే టీఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేసే అభ్యర్థికి అండంగా ఉండి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంగళ్‌రావు, ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, మోహన్‌రాథోడ్‌, స్వాతి శ్రీనివాస్‌, రుక్మిణిశ్రీనివాస్‌, సంతోషసిద్దిరెడ్డి, నర్సవ్వశ్రీకాంత్‌రెడ్డి, స్వర్ణలతభాగ్యరాజ్‌,  శ్రీనివాస్‌, ఎంపీటీసీ హోళియనాయక్‌, టెలికాం బోర్డు సభ్యులు తీగుళ్ల వేణుగోపాల్‌శర్మ, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జగన్‌గౌడ్‌, నాయకులు అంజగౌడ్‌, విశ్వేశ్వర్‌, బాల్‌నర్సింహులు పలువురున్నారు.అలాగే, మండల పరిధిలోని పోతాన్‌పల్లితో పాటు పలు గ్రామాల్లో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.


logo