శుక్రవారం 23 అక్టోబర్ 2020
Siddipet - Sep 20, 2020 , 03:04:51

ప్రగతికే పట్టం కట్టాలి

ప్రగతికే పట్టం కట్టాలి

తొగుట: అభివృద్ధి చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకే ఉప ఎన్నికలో పట్టం కట్టాలని రైతు బంధు సమితి రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవీరవీందర్‌ అన్నారు. మండలంలోని ఘనపూర్‌, గోవర్ధనగిరి, వర్ధరాజ్‌పల్లి గ్రామాల్లో ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు డిపాజిట్‌ కూడా దక్కదని జోస్యం పలికారు. సోలిపేట ఆశయాల కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, కొండపాక, తొగుట మండలాల రైతుబంధు సమితి కన్వీనర్లు ర్యాగల దుర్గయ్య, కనకయ్య, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ తొగుట మండలాధ్యక్షుడు  మల్లారెడ్డి, ఎంపీటీసీ శరత్‌ పాల్గొన్నారు.


logo