శనివారం 31 అక్టోబర్ 2020
Siddipet - Sep 20, 2020 , 03:04:49

దుబ్బాకలో వేగంగా అభివృద్ధి పనులు

దుబ్బాకలో వేగంగా అభివృద్ధి పనులు

దుబ్బాక టౌన్‌: పట్టణంలో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితభూంరెడ్డి తెలిపారు. శనివారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ పట్టణంలో రూ.50 లక్షలతో తెలంగాణ తల్లి చౌరస్తా, బస్‌డిపో చౌరస్తా వద్ద జంక్షన్లను ఏర్పాటు చే స్తున్నామని, రూ.1.50 కోట్ల తో నిర్మిస్తున్న వైకుంఠధా మం, స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. ఈ నెల 21న మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారని చైర్‌పర్సన్‌ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరవుతారన్నారు. చైర్‌పర్సన్‌ వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు బట్టు ఎల్లం, లొంక లక్ష్మణ్‌, ఆకుల రమేశ్‌ ఉన్నారు.