గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Sep 19, 2020 , 02:21:15

అభిమాన నాయకుడికి అరుదైన బహుమతి

అభిమాన నాయకుడికి అరుదైన బహుమతి

  • బొల్లారంలో 14 వేల చదరపు అడుగుల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే భారీ చిత్రపటం
  • జన్మదిన కానుకగా ఎమ్మెల్యేకు అంకితం చేసిన వరప్రసాద్‌రెడ్డి 

బొల్లారం : తమ అభిమాన నాయకుడి కోసం వినూత్నంగా తయారు చేసిన చిత్రపటాన్ని ఓ అభిమాని ఆవిష్కరించాడు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్‌ పాఠశాల ప్రాంగణంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 14 వేల చదరపు అడుగుల బొమ్మను టీఆర్‌ఎస్‌కేవీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వి.వరప్రసాద్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి అద్భుతంగా చిత్రించారు. నేడు ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ చిత్రాన్ని అంకితం చేసి శుభాకాంక్షలు తెలిపాడు. సందర్భంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ వారంరోజులపాటు సోషల్‌ మీడియా, గూగుల్‌లో వేతికి ఈ అరుదైన ఆలోచనకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.   

VIDEOS

logo