శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 17, 2020 , 02:52:40

ఓజోన్‌ పొరను రక్షించుకుందాం

ఓజోన్‌ పొరను రక్షించుకుందాం

  •  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌ : భూ వాతావరణంలోని ఓజోన్‌ పొరను సంరక్షించుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌరులందరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పిలుపునిచ్చారు.  అంతర్జాతీయ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. భూమికి రక్షణ కవచం లా ఉంటూ సమస్త జీవకోటిని కాపాడుతున్న ఓజోన్‌పొర సంరక్షణ ఆవశ్యకతను గుర్తు చేశారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే ఓజోన్‌ పొర క్షీణిస్తుందని తెలిపారు.  మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు. కాలుష్యాన్ని నివారించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం విశేష కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ హరితహారాన్ని చేపట్టి ప్రతి యేటా కోట్లాది మొక్కలను నాటిస్తున్నారని కొనియాడారు. జల, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. పర్యావరణం, ఓజోన్‌ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకం నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. 


logo