శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 14, 2020 , 00:15:59

కాళోజీ పురస్కారాలు

కాళోజీ పురస్కారాలు

సిద్దిపేట టౌన్‌ :  ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య కళాపీఠం  ఆధ్వర్యంలో తెలుగు భాష, కాళోజీ జీవితం, సాహిత్యంపై ఆదివారం సిద్దిపేటలో కవులు, రచయితలతో ఆదివారం రాష్ట్రస్థాయి వెబ్‌నార్‌ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య కళాపీఠం అధ్యక్షురాలు శాంతకుమారి మాట్లాడుతూ.. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందికి కాళోజీ పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన సామలేటి లింగమూర్తితోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భాస్కర్‌, నరేందర్‌రెడ్డి, రవీందర్‌, మోహన్‌రావు, నిహారిని, దేవదాస్‌, త్రివేణి, సుమన్‌, మల్లేశ్‌, మౌనశ్రీ, రవీంద్ర తదితరులు కాళోజీ పురస్కారాలకు ఎంపికయ్యారని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత వారందరికీ పురస్కారం అందజేస్తామన్నారు. తెలుగు సాహిత్య పీఠం చేస్తున్న సాహిత్య కార్యక్రమాలను ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ప్రత్యేకంగా అభినందించి, కాళోజీ పురస్కారాల గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. వెబ్‌నార్‌ సమ్మేళనంలో కవులు, రచయితలు పాల్గొని మనోభావాలు వెల్లడించారు. జూమ్‌ వెబ్‌నార్‌లో ప్రజాకవి కాళోజీపై 120 మంది కవులు తమ కవితలు వినిపించారు. 


logo