శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 13, 2020 , 00:24:58

ఊరూరా సీఎం కేసీఆర్‌కు జేజేలు

 ఊరూరా  సీఎం కేసీఆర్‌కు జేజేలు

  • పచ్చని పంటపొలాల్లో రైతుల సంబురాలు
  • ‘నమస్తే తెలంగాణ’ను ఆసక్తిగా చదివిన రైతులు
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు

సిద్దిపేట, నమస్తేతెలంగాణ : సీఎం కేసీఆర్‌ తెచ్చిన రెవెన్యూ చట్టానికి అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఊరురా రైతులు తమ పంట పొలాలు, గ్రామ చావిడిల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంబురాలు చేశారో ...  ఈ రోజూ కూడా అదే తరహాలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.


గ్రామాల్లో ‘నమస్తే తెలంగాణ పత్రిక’లో రెవెన్యూ చట్టంపై వచ్చిన ప్రత్యేక కథనాలను ఆసక్తిగా రైతులు చదువుతున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఎదుర్కోంటున్న  భూ సమస్యలకు కొత్త రెవెన్యూ చట్టంతో పరిష్కారం వస్తుందన్న దీమా...కొండంత ధైర్యం రైతుల కండ్లలో కనిపించింది. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని అన్ని డివిజన్‌ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో శనివారం రైతులు సంబురాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, కొండంరాజ్‌పల్లి గ్రామాల రైతులు తమ పంట పొలాలు, వాగు వద్ద సంబరాలు నిర్వహించారు.  సీఎం కేసీఆర్‌ రైతు బిడ్డ.. రైతుల కష్టాలు పూర్తిగా తెలిసినవారు కావడంతో ప్రతి క్షణం తమ గురించి ఆలోచించి కష్టాలు తీరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు కొత్త రెవెన్యూ చట్టంతో పరిష్కారం అవుతాయన్న దీమా రైతుల్లో కనపించింది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రవేశపెడుతున్న ధరణి పోర్టల్‌ను తామే నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భూరికార్డుల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సాదాబైనామాకు అవకాశం ఇవ్వడం హర్షణీయం.


జీవో 58, 59 ద్వారా ఎంతో మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. ప్రతి అంగుళం భూమిని సర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజిటల్‌ సర్వే చేసి, భూ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లను చేయనున్నారు. ఏక కాలంలోనే రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్లు చేసి రైతులకు అందజేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ సంస్కరణలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే రైతులకు  రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, మార్టిగేజ్‌, సెల్‌డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, క్యాన్సలేషన్‌, ఈసీ పత్రాలను అందజేస్తారు. ఇవ్వాళ ఎక్కడ చూసినా కొత్త రెవెన్యూ చట్టంపై ప్రతి గ్రామ చావిడిలో  ఇదే చర్చ. రైతు బాంధవుడు మన సీఎం కేసీఆర్‌ అంటూ రైతులు జేజేలు పలుకుతున్నారు.  

కొత్త చట్టం ఓ వరం..


సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం ప్రజలకు వరంగా మారింది. ఈ కొత్తచట్టం ప్రజలు, రైతులకు ఉపయోగకరంగా ఉండటం సంతోషకరం. భూ సమస్యల కోసం ఏండ్ల తరబడి కార్యాలయాలు, కోర్టులు చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితి పోయి, వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు సరళతరం కానున్నాయి. ఈ చట్టం విప్లవత్మాక మార్పుగా చరిత్రలో నిలుస్తుంది. రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పూర్తిగా అంతం కానున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.

- మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, దుబ్బాక మండలం


logo