శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 13, 2020 , 00:25:00

పెండింగ్‌ జరిమానాలు చెల్లించిన ఏసీపీ

 పెండింగ్‌ జరిమానాలు చెల్లించిన ఏసీపీ

సిద్దిపేట టౌన్‌ : ఏసీపీ రామేశ్వర్‌ సొంత వాహనంపై ఉన్న ఈ - చలాన్‌ పెండింగ్‌ జరిమానాలను పేటీఎం ద్వారా శనివారం చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు పెండింగ్‌ జరిమానాలను వెంటనే చెల్లించాలని సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ ఆదేశాలతో త్వరలోనే జిల్లాలో పెద్ద ఎత్తున స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతామని తెలిపారు. మూడు కంటే ఎక్కువగా ఉన్న ఈ - చలాన్‌ పెండింగ్‌ జరిమానాలను వాహనదారులు వెంటనే చెల్లించాలని సూచించారు. 

పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌..   : రూ. 2.10 లక్షలు వసూలు

వాహనాలపై ఉన్న ఈ - చలాన్‌ పెండింగ్‌ జరిమానాల వసూళ్ల ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే శనివారం పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. సిద్దిపేట ట్రాఫిక్‌, గజ్వేల్‌, చిన్నకోడూరు, మర్కూక్‌, జగదేవ్‌పూర్‌, అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధి లో విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా 156 వాహనాలపై పెండింగ్‌లోని 481 ఈ - చలాన్‌ కేసుల్లో జరిమానాలు విధించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా వాహన యజమానుల నుంచి రూ.2,10,721 జరిమానా వసూలు చేశారు. 


logo