గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 13, 2020 , 00:25:08

సందర్శకుల తాకిడి

సందర్శకుల తాకిడి

హుస్నాబాద్‌ : హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ చెరువుకు మరోసారి జలకళ వచ్చింది. శుక్రవారం రాత్రి ఎగువన కురిసిన వర్షాలతో వరద నీరు చేరి మత్తడి దుంకుతున్నది. హుస్నాబాద్‌ నుంచి మాలపల్లి, గౌరవెల్లి, రామవరం గ్రామాలకు ఎల్లమ్మ చెరువు మత్తడిపై నుంచి వెళ్లాల్సి ఉన్నందున మత్తడి దాటేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండో సారి చెరువు మత్తడి దుంకుతుండడంతో పట్టణం నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రజలు మత్తడిని  సందర్శించారు. ఎల్లమ్మ చెరువు నెల రోజుల్లో రెండుసార్లు మత్తడి పోయడం శుభసూచమని రైతులు ఆనందపడుతున్నారు. 


logo