ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 10, 2020 , 03:40:29

ఇందూరు ఇంజినీరింగ్‌ కాలేజీలో నేటి నుంచి ఎంసెట్‌

ఇందూరు ఇంజినీరింగ్‌ కాలేజీలో నేటి నుంచి ఎంసెట్‌

సిద్దిపేట రూరల్‌ : ఫార్మసీ, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌కు జిల్లా కేంద్రం సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాల సిద్ధ్దమైంది. నేటి నుంచి 14వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:00 నుంచి 12:00 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రతి సెషన్‌కు వంద మంది చొప్పున రోజుకు 200 మంది, మొత్తం 600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. హాల్‌లో భౌతిక దూరం పాటించేలా కంప్యూటర్లను అమర్చారు. హాల్‌ టికెట్‌ బార్‌కోడ్‌, ఫేస్‌ ఫొటోను స్కానింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తారు. 

జేఎన్‌టీయూలో సజావుగా ఎంసెట్‌  

పుల్కల్‌ : జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం ఎంసెట్‌ ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్‌ బాలూనాయక్‌ తెలిపారు. పరీక్షలకు 200 మంది విద్యార్థులకు గాను 168 మంది హాజరయ్యారని చెప్పారు. ఉదయం 9గంటలకు 100 మందికి గాను 91 మంది హాజరుకాగా, మధ్యాహ్నం 3గంటలకు జరిగిన పరీక్షకు 100 మందికి 77 మంది విద్యార్థులు హాజయ్యారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి పరీక్షా హాల్‌లోకి అనుమతినిచ్చారు. శానిటైజర్‌, మాస్క్‌లను అందజేశారు.logo