గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 10, 2020 , 03:40:30

ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి

ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి

  •  సంగారెడ్డి డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌

సంగారెడ్డి మున్సిపాలిటీ : కరోనా (కొవిడ్‌-19) వచ్చి తగ్గిన వారు ప్లాస్మా దానం చేయడం వల్ల మరో ఇద్దరు కరోనా బాధితులకు ప్రాణదాతలుగా ఉండొచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో సినీ హీరో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు కేకే లడ్డు (చిరు) ఆధ్వర్యంలో ప్లాస్మా దాన అవగాహన పోస్టర్‌ను డీఎంహెచ్‌వో విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్లాస్మా దానం చేయండి, కరోనా బాధితులకు ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు. ఈ నెల 3వ తేదీ నుంచి చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ప్లాస్మా సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దానం చేసిన ప్లాస్మాను ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారు, తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేద కరోనా బాధిత పేషెంట్లకు ఉచితంగా ప్లాస్మా అందజేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు హెచ్‌.నరేంద్ర, బీ శ్రీనివాస్‌చారి, సంజయ్‌చారి, ఎం.సాయివినాయక్‌, జే.నరేశ్‌, సందీప్‌రెడ్డి, ఎన్‌.మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo