మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 09, 2020 , 00:59:59

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

  • n  పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల      నిర్మాణాలు పూర్తి చేయాలి
  •  n తూప్రాన్‌ డివిజన్‌ స్థాయి సమావేశంలో      డీపీవో హనోక్‌

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీపీవో హనోక్‌ సూచించారు. తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌ అధ్యక్షతన మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తూప్రాన్‌, మనోహరాబాద్‌, వెల్దూర్తి, చేగుంట, నార్సింగ్‌ మండలాల్లోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, పల్లెప్రకృతి వనాలు, హరితహారం మొక్కల పెంపకం, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడారు. గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నిర్మాణం పనుల్లో అలసత్వం వహించకుండా, త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో వరలక్ష్మి,ఎంపీడీవోలు,వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.logo