శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 07, 2020 , 23:42:03

‘భూ’రికార్డులను అప్పగించిన వీఆర్వోలు

‘భూ’రికార్డులను అప్పగించిన వీఆర్వోలు

సిద్దిపేట రూరల్‌ :  ప్రభుత్వం వీఆర్‌వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో సిద్దిపేట రూరల్‌ మండల వీఆర్‌వోలు సోమవారం రికార్డులను అప్పగించారు. ఈ మేరకు పట్టణంలోని సిద్దిపేట రూరల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ పరమేశ్వర్‌కు రికార్డులను అందజేశారు.

నారాయణరావుపేట : ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల వీఆర్‌వో లు తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ జానకికి వీఆర్‌వోలు రికార్డులను అందజేశారు. 

మర్కూక్‌ : జిల్లా పరిపాలనాధికారి ఆదేశాల మరకు సోమవారం గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి మర్కూక్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో రికార్డుల పరిశీలిన అనంతరం తహసీల్దార్‌ ఆరీఫాబేగానికి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామాల రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం 3 వరకు మండలంలోని 9 రెవెన్యూ గ్రామాలకు చెందిన ఆరుగురు వీఆర్‌వోలు  తమ తమ గ్రామాలకు సంబంధించిన  దస్తావేజులను తహసీల్దార్‌ ఆరీఫాబేగానికి అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుండడంతో ఈ చర్యలను చేపట్టినట్లు తెలిపారు. 

గజ్వేల్‌లో..

గజ్వేల్‌ అర్బన్‌ : గజ్వేల్‌ మండలంలో పని చేస్తున్న 13 మంది వీఆర్వోలు తమ వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులను సోమవారం  తహసీల్దార్‌ కార్యాలయంలో అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రికార్డులను అప్పగించాలని వీఆర్వోలకు తహసీల్దార్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరుగా తమ వద్ద రికార్డులను వీఆర్వోలు తహసీల్దార్‌ కార్యాలయంలో అప్పగించారు. 


logo