శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 07, 2020 , 01:43:57

జనం కోసమే జర్నలిస్టులు

జనం కోసమే జర్నలిస్టులు

 సిద్దిపేట టౌన్‌ : జర్నలిస్టుల వృత్తి కత్తిమీద సాము అని, ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పనిచేసే వారే జర్నలిస్టులని వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఉపాధ్యక్షుడు గంప శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం జర్నలిస్టు డేను పురస్కరించుకొని సిద్దిపేట వాసవి క్లబ్‌, వనితా క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. జర్నలిస్టులను సన్మానించడంపై వాసవి క్లబ్‌ అధ్యక్షుడు చిలువేరి శ్రీనివాస్‌ను, వనితా క్లబ్‌ అధ్యక్షురాలు నాగరాణిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవీక్లబ్‌ ప్రతినిధులు గంప కృష్ణమూర్తి, యాద శ్రీనివాస్‌, పుల్లూరు శివ, వీరేశం తదితరులు పాల్గొన్నారు. 

 జర్నలిస్టుల పాత్ర కీలకమైంది

మర్కూక్‌ : సమాజంలో జర్నలిస్టులపాత్ర ఎంతో కీలకమైనదని ఆత్మకమిటీ డివిజన్‌ సభ్యుడు యావగారి సంతోశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్‌ అచ్చంగారి భాస్కర్‌తో కలిసి విలేకరులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిలా ఉండి నిరంతరం సమాజసేవలో ముందుండేవారు జర్నలిస్టులన్నారు. మిగతా రంగాల్లో వారికంటే జర్నలిస్టుల పాత్ర సమాజంలో భిన్నంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీధర్‌రెడ్డి, నాగిరెడ్డి, అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి, ప్రజలకు వారధులు జర్నలిస్టులు 

కొండపాక : సమాజ హితం కోసం జర్నలిస్టులు నిస్వార్థ సేవలు అంది స్తూ జన సంక్షేమానికి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని వాసవి క్లబ్‌ జిల్లా అదనపు కార్యదర్శి పెద్ది కుమార్‌, కొండపాక మండల అధ్యక్షుడు బెజుగామ వెంకటేశం అన్నారు. అంతర్జాతీయ జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులను దుద్దెడ వైష్ణవి గార్డెన్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమాజానికి మేలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 

 నిస్వార్థ సేవకులు పాత్రికేయులు

ములుగు : సమాజ హితం కోసం పని చేస్తున్న నిస్వార్థ సేవకులు జర్నలిస్టులని రోటరీక్లబ్‌ రాష్ట్ర రీజియన్‌ కోఆర్డినేటర్‌ కొడాలి చంటి అన్నారు.  జర్నలిస్టు డేను పురస్కరించుకొని పాత్రికేయులను రోటరీక్లబ్‌ ఆఫ్‌ గజ్వేల్‌ ప్రతినిధులు సన్మానించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను చైత న్యపరుస్తూ సకల సమాచారాన్ని సేకరిస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ చార్టర్‌ ప్రెసిడెంట్‌ కొమ్మారెడ్డి మురళీధర్‌రెడ్డి, ట్రీసరీ ఏనుగు బాపురెడ్డి, జనరల్‌ సెక్రెటరీ దాస జగదీశ్వర్‌, మాజీ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. 


logo