గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 06, 2020 , 02:35:52

పనులను వేగవంతంగా చేపట్టాలి

పనులను వేగవంతంగా చేపట్టాలి

  • నిధులను వెంటనే విడుదల చేయాలి

మెదక్‌: మెదక్‌ జిల్లాలోని అన్ని మండలాల్లో విలేజ్‌ మార్ట్‌లను ఏర్పాటు చేయాలని మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మెదక్‌ కలెక్టరేట్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ  నిర్లక్ష్యం వహించకుండా విలేజ్‌ మార్ట్‌ల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వైకుంఠధామాల పనులకు అవసరమైన నిధులను విడుదల చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు చెల్లించారు..? ఇంకా ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్న విషయాలను డీఆర్డీవో శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులకు సంబంధించిన విషయంలో నిధులను ఏ మాత్రం ఆపకుండా వెంటనే విడుదల చేయాలని సూచించారు. వెల్దుర్తి, కొల్చారం మండలాల్లో విద్యుత్‌ పనుల్లో ఇబ్బందులు ఉన్నాయని ఎంపీపీ, కొల్చారం జడ్పీటీసీ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణగా కంచెలు ఏర్పాటు చేయాలని, స్తంభాలను, వైర్లను సరిచేయాలని తెలిపారు.  స్పందించిన కలెక్టర్‌ వెంటనే ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్‌ చేసి కరెంట్‌కు సంబంధించిన పనులను  పూర్తిచేసి వాటి వివరాలను వాట్సాప్‌లో పెట్టాలని ట్రాన్స్‌కో అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, అధికారులు గ్రామాలను సందర్శించాలన్నారు. జిల్లాలోని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులతో పాటు రైతు వేదికలు, గ్రామాల్లో చేసే ప్రభుత్వ పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  మెదక్‌ పట్టణంతోపాటు శివ్వంపేట, మెదక్‌, తూప్రాన్‌, చేగుంట, రామాయంపేట మండలాలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో రోడ్లన్నీ గుంతలు పడి ఇబ్బందికరంగా ఉన్నాయని మూడు, నాలు గు రోజుల్లో గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. వివరాలను తనకు సబ్మిట్‌ చేయాలని ్ర్జక్టర్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌, ఆయా శాఖల అధికారులు, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

అసంపూర్తి భవనాలను పూర్తిచేయాలి 

చేగుంట: అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం చేగుంటలోని అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాలు, రైతు బజారు నిర్మాణ పనులను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలతో పాటు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు, రైతు వేదికల భవనాలు సత్వరమే పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌, తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, డీఈ నర్సింహులు, తహసీల్దార్‌ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.


logo