శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 05, 2020 , 01:54:40

‘దోస్త్‌'కు రెండు రోజులే గడువు

‘దోస్త్‌'కు రెండు రోజులే గడువు

  • n ఆగస్టు 22 నుంచే ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 
  • n అక్టోబర్‌ 3 వరకు  కొనసాగనున్న ప్రక్రియ
  • n మెదక్‌ జిల్లాలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 

మెదక్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) సంబంధించిన మొదటి ఫేజ్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ఫేజ్‌లో విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్‌ లేదా దానికి సమాన అర్హత ఉన్న వారు దోస్త్‌ ద్వారా డిగ్రీ అడ్మిషన్‌ పొందవచ్చు. ఆగస్టు 22 నుంచి మొదలైన ఈ దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ మూడు ఫేజ్‌ల్లో అక్టోబర్‌ 3వ తేదీ వరకు పూర్తి కానున్నది. ఇక ఆ తర్వాత విద్యార్థులు డిజిటల్‌ లేదా ఫిజిక్‌ క్లాసులు మొదలు పెట్టనున్నారు. 

మెదక్‌ జిల్లాలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 

జిల్లాలో రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు కొల్చారంలో సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కళాశాల, మెదక్‌ పట్టణంలో మైనార్టీ డిగ్రీ కళాశాలతోపాటు జిల్లాలో 11 వరకు ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. మెదక్‌ జిల్లాలో 18 కళాశాలల్లో 4,300 సీట్లు కేటాయించారు. గతేడాది నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే అడ్మిషన్లు ఎక్కువగా అయ్యేటట్లు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

దోస్త్‌ 2020 డిగ్రీ అడ్మిషన్‌ ప్రవేశ ప్రక్రియ 

శాతవాహన, మహాత్మాగాంధీ పరిధిలోని కళాశాలల్లో బీఏ, బీఎస్సీ, బీకాం తదితర కోర్సుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 22వ తేదీన ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్‌ 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సెప్టెంబర్‌ 16న మొదటి విడుత సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందన్నారు. రెండో విడుత రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 23 వరకు ఉండగా, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. రెండో విడుత వెబ్‌ ఆప్షన్లు సెప్టెంబర్‌ 17 నుంచి 23 వరకు, రెండో విడుత సీట్ల కేటాయింపు సెప్టెంబర్‌ 28న ఉంటుంది. రెండో విడుతలో సీట్లు పొందిన విద్యార్థులు 28వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈ రెండు విడుతల్లో సీట్లు దొరకని వారు మూడో విడుత రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు ఉండగా, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. మూడో విడుత వెబ్‌ ఆప్షన్లు 28 నుంచి అక్టోబర్‌ 3 వరకు, మూడో విడుత సీట్ల కేటాయింపు అక్టోబర్‌ 8వ తేదీన ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్‌ 8వ తేదీ నుంచి 10 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.


logo