బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 04, 2020 , 00:24:10

ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలి

ఆన్‌లైన్‌ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలి

n టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్‌

n ఇంటింటికీ తిరిగి విద్యార్థులకు అవగాహన 

సిద్దిపేట రూరల్‌/సిద్దిపేట అర్బన్‌ : కరోనా పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం వృథాకాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్‌ అన్నారు. గురువారం టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం ఇందిరమ్మ కాలనీలో పర్యటించి టీ శాట్‌, డీడీ యాదగిరి ఛానళ్లలో వస్తున్న క్లాసులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.   ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ పట్టణ అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి విజేందర్‌రెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌కు దరఖాస్తుల ఆహ్వానం 

అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(రెసిడెన్షియల్‌ బ్రిడ్జి స్కూల్‌) నందు 2020-21 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని స్పెషల్‌ ఆఫీసర్‌ ఇమ్రానబేగం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నాల్గో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు మీడియంలో బాలురకు మాత్రమే అడ్మిషన్లకు సౌకర్యం ఉందన్నారు. అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో అనాథలు, బడుగు, బలహీన, పేద కుటంబాల విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.   విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచిత హాస్టల్‌ వసతి, నెలవారీ ైస్టెఫండ్‌ సౌకర్యం ఉన్నదన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే వచ్చి అడ్మిషన్లు పొందాలని సూచించారు. అడ్మిషన్లకు రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌, పుట్టిన తేదీ వివరాలను తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9121565671, 9959992475 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.logo