సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 01, 2020 , 02:26:05

కరోనాతో భయం లేదు..

కరోనాతో భయం లేదు..

  • ఎప్డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌ : కరోనా వైరస్‌ పై భయాందోళన అనవసరమని, తగిన జాగ్రత్తలు పాటిస్తే దానిని ఎదుర్కొనవచ్చని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌ మండలం బూర్గుపల్లిలో సోమవారం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. గ్రామాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. గుంపులు గుంపులు తిరుగొద్దన్నారు. భౌతిక దూరం పాటించి..మాస్క్‌లు ధరించాలన్నారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ, పరిశుభ్రతను పాటించాలన్నారు. బూర్గుపల్లిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామానికి బస్సులో వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు నిర్వహించడంతో స్థానికులకు సౌకర్యవంతంగా మారిందన్నారు. గ్రామంలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.


logo