గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Aug 30, 2020 , 02:25:35

సీఎం కేసీఆర్‌ కృషితో పోలీస్‌శాఖ పటిష్టం

సీఎం కేసీఆర్‌ కృషితో పోలీస్‌శాఖ పటిష్టం

  • రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ దామోదర్‌గుప్తా

కొండపాక : మండలంలోని దుద్దెడ శివారులో నిర్మిస్తున్న జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ సముదాయాన్ని త్వరలో సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్త్తా తెలిపారు.  సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ను సందర్శించి, నిర్మాణ పను లను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ కృషితో పోలీసుశాఖ పటిష్టం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఉందని తెలిపారు. తెలంగాణ పోలీస్‌ అంటే స్కాట్‌లాండ్‌ దేశంలో ఉన్న పోలీస్‌స్థాయిలో ఉండాలని సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అధునిక వాహనాలను అందజేశారన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఇన్నోవా కార్లు రాష్ట్రంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోసం ట్విన్‌ టవర్స్‌ (ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌) నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే పోలీసు ప్రధాన కేంద్రానికి చేరుతుందన్నారు.  14 జిల్లా కేంద్రాల్లో డీపీవో భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం భవన నిర్మాణం 20 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు. రూ.15 కోట్ల ఖర్చుతో 60 వేల చదరపు అడుగులు, 120 ఫిల్లర్స్‌తో మూడు అంతస్తులతో జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ బోర్డు ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈ రాజయ్య, తొగుట సీఐ రవీందర్‌, కుకునూర్‌పల్లి ఇన్‌చార్జి ఎస్సై సుధాకర్‌, ఏఈ సుధాకర్‌, ప్రాజెక్టు మేనేజర్‌ సందీప్‌రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

అసంపూర్తి పనులను పూర్తిచేయాలి

మర్కూక్‌ : రాష్ట్రంలో ఆయా పోలీస కమీషనరేట్‌ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లలో అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదరగుప్తా తెలిపారు. మొత్తం 8.35 గుంటలలో 14కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.  


logo