మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 30, 2020 , 02:25:37

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

  • ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి 

తూప్రాన్‌ రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ తూప్రాన్‌ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డితో కలిసి మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. మారుమూల పల్లెసీమలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు, రాష్ర్టాలు, దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి గ్రామానికి ఏడాదికి రూ.10 కోట్లు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పట్టణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రతివీధి, కాలనీల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతోనే చెక్‌డ్యాంలను నిర్మించారన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, నాయకులు జంగం రాములు, అజార్‌, వెంకటేశ్‌యాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, కుమ్మరి రఘుపతి, మామిండ్ల కృష్ణ, వెంకట్‌గౌడ్‌  పాల్గొన్నారు.


logo