శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 29, 2020 , 00:58:44

ఉత్సాహంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు శ్రీకారం

ఉత్సాహంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు శ్రీకారం

  • n తండాలో మొక్కలు నాటే మహాయజ్ఞం
  • n 800మొక్కలు నాటిన గిరిజనులు
  • n సర్పంచ్‌, స్థానికులకు కలెక్టర్‌ అభినందనలు

సిర్గాపూర్‌ :గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్‌ పిలుపు మేరకు గానూ జిల్లాలోని సిర్గాపూర్‌ మండలం జమ్లాతండాకు చెందిన 400మంది ఒకే చోట చేరి 800 మొక్కలను నాటి  మరెంతో మందికి స్ఫూర్తిని నిలిచారు. హరిత తెలంగాణ దిశగా కదం తొక్కిన తండా వాసుల కృషి పట్ల జిల్లాలో ప్రశంసలు వెల్లు వెత్తాయి. ఈమేరకు జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు కూడా ప్రశంసించి అభినందించారు. గత గురువారం రోజు  జమ్లాతండా సర్పంచ్‌ దివ్యభారతీచరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన రెండు కిలో మీటర్ల పొడువున అవెన్యూ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని సంగారెడ్డి డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు ప్రారంభించిన విషయం విదితమే. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మేరకు జమ్లాతండా వాసుల 400 మంది ఒకే చోట చేరి కలిసి కట్టుగా మొక్కలు నాటడంపై జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు సర్పంచ్‌ దివ్యభారతిచరణ్‌కు ఫోన్‌ చేసి సర్పంచ్‌కు, తండా ప్రజలకు అభినందనలు తెలిపారు. దాంతో సర్పంచ్‌ గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి.. నాటిన ప్రతి మొక్కను కన్న బిడ్డలా కాపాడుకోవాలనే నినాదంతో ముందుకు సాగుతున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు జమ్లాతండా ప్రజలు ఐక్యమత్యంతో మొక్కలు నాటి ఊరంతా సంబురం జరుపుకున్నారు. మొక్కలు నాటే యజ్ఞంలో ప్రజలంతా అతి ఉత్సహాంతో పాల్గొని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే గతేడాదిన జమ్లాతండా పరిధిలోని జీవ్లాతండా, తోళ్యా, జమ్లాతండాలల్లో సర్పంచ్‌ దివ్యభారతీ తన స్వంత ఖర్చులతో ప్రతి ఇంటింటా 800 కొబ్బరిచెట్ల మొక్కలు, వివిధ రకాల పండ్ల మొక్కలను నాటారు. అవి ప్రస్తుతం ప్రతి ఇంట పచ్చలహారంతో మురుస్తున్నాయి.  అదే విధంగా హరితహారం కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటింటా మొక్కలు నాటి వా టి పెరుగుదలకు కృషి చేస్తున్నారు.

మొక్కలను కన్న బిడ్డలా  కాపాడుకుంటాం..

నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వాటిని కన్న బిడ్డలా కాపాడుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారం లక్ష్యాన్ని అధిగమించేందుకు తమ వంతుగా కృషి చేస్తాం. మొక్కలు నాటడం ఓ యజ్ఞంలా భావించి చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకుగాను తమ గ్రామ ప్రజలు ఐక్యమత్యంతో ముందుడుగు వేయడంతోనే కార్యక్రమం విజయవంతం చేయగల్గుతున్నాం. హరితహారం మొక్కలతో పచ్చని వనంలా మారుస్తాం.

- దివ్యభారతిచరణ్‌ సర్పంచ్‌  జమ్లాతండా

బొడిగె రాళ్లల్లో మొక్కలను పెంచి వృద్ధి చేస్తాం..

తమ ప్రాంతమంతా బొడిగెరాళ్లతో ఉంటుంది. పచ్చని మొక్క కూడా కనబడని ఈ ప్రదేశంలో పచ్చని మొక్కలు నాటి హరితవనంలా మార్చాలని తమ సర్పంచ్‌, ప్రజలమంతా కలిసి పెద్ధ ఎత్తున మొక్కలు నాటి సంబురం జరుపుకున్నాం. బొడిగె రాళ్లల్లో నాటిన ప్రతి మొక్కను కాపాడి వృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరు ఛాలెంజ్‌కు తీసుకున్నాం. రోడ్డు కిరువైపుల 800 

మొక్కలు నాటినం.

- మారునీబాయి, జమ్లాతండా వాసి


logo