గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Aug 28, 2020 , 02:36:45

కరోనాతో నలుగురు మృతి

కరోనాతో నలుగురు మృతి

 రామాయంపేట: కరోనా పాజిటివ్‌తో 55 ఏండ్ల వృద్ధుడు గురువారం మృత్యువాత పడ్డాడు. రామాయంపేట చాకలి బస్తీకి చెందిన వృద్ధుడిని రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీలో చికిత్సకోసం కుటుంబీకులు తరలించారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఐసొలేషన్‌లో ఉంచారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.  మృతుల ఇండ్ల వద్ద మున్సిపల్‌ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

కొమురవెల్లిలో రేషన్‌ డీలర్‌..

కొమురవెల్లి : మండల కేంద్రం  కొమురవెల్లికి చెందిన రేషన్‌ డీలర్‌  కరోనాతో గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆనారోగ్యంతో హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో కొన్ని రోజులుగా వైద్యచికిత్స పొందుతున్న రేషన్‌ డీలర్‌ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మండలంలో తొలి కరోనా మృతి చోటు చేసుకుంది.

తూప్రాన్‌ పట్టణంలో ఇద్దరు..

తూప్రాన్‌ రూరల్‌ : పట్టణానికి చెందిన ఇద్దరు కొవిడ్‌ పాజిటివ్‌తో గురువారం మృతి చెందారని తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ ఆనంద్‌ చెప్పారు. పట్టణానికి చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు, 23 ఏండ్ల వివాహిత మహిళ  మృతి చెందినట్లు ఆయన తెలిపారు. 


logo