ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 26, 2020 , 23:53:30

గణపతి బప్పా.. మోరియా

గణపతి బప్పా.. మోరియా

  • సదాశివపేటలో ఘనంగా నిమజ్జనం 

సంగారెడ్డి టౌన్‌: సదాశివపేటలోవినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. బుధవారం పేట మున్సిపాలిటీ పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి మున్సిపాలిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, అన్ని వార్డుల నుంచి వినాయక విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌక్‌ నుంచి మాడిశెట్టి రాచయ్య బావి వరకు ఊరేగింపు నిర్వహించి వినాయక నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా పట్టణ ప్రజలు వినాయక విగ్రహాల ముందు భజనలు, కోలాటం ఆడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా బావి వద్ద క్రేన్‌ ఏర్పాటు చేసి బావిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమాలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పిల్లోడి జయమ్మ, వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌, కమిషనర్‌ స్పందన, పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు. logo