మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 26, 2020 , 23:53:31

చికారీ‘పల్లెప్రగతి’తో మారుతున్న రూపురేఖలు

చికారీ‘పల్లెప్రగతి’తో మారుతున్న  రూపురేఖలు

  • l ప్రతి రోజు చెత్త సేకరణ
  • l హరితహార మొక్కలకు నీరు
  • l వ్యాధుల నివారణకు రసాయనాల పిచికారీ

మెదక్‌ రూరల్‌ :  ప్రతి పల్లె  పరిశుభ్రతో కోసం ప్రభుత్వం  నిర్వహిస్తున్న పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. చెత్త  సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించడానికి పల్లెప్రగతిలో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చింది.  వీటితో గ్రామాల్లో వివిధ పనులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ  చెత్తను సేకరణ చేసి డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా రసాయనాల పిచికారీ చేయడంతో పాటు  నాటిన మొక్కలకు ట్యాంకర్లతో నీటిని పడుతున్నారు. 

పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ...

-మౌనిక, మండల పంచాయతీ అధికారి

ట్రాక్టర్ల పంపిణీతో మండలంలోని గ్రామాలు శుభ్రంగా మారాయి. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని ఆదేశించడంతో మండలంలోని 19 గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేశాయి. వీటితో మొక్కలకు నీరు పట్టడటంతోపాటు  గ్రామాభివృద్ధి పనులకు ఎంతో ఉపయోగపడుతుంది. చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తుండటంతో పల్లెలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. 


logo