బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 26, 2020 , 02:28:06

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ

  •  చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ 

జహీరాబాద్‌/కోహీర్‌: కష్టకాలంలో రాష్ట్ర ప్రభు త్వం పేదలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేస్తోందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ అన్నారు. మంగళవారం జహీరాబాద్‌ పట్టణంలోని జేజే ఫంక్షన్‌ హాల్‌లో  మొగుడంపల్లి, జహీరాబాద్‌ పట్టణ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. 320మంది లబ్ధ్దిదారులకు రూ.3.27 కోట్ల చెక్కులు అందజేశామన్నారు. కల్యాణ లక్ష్మి 148 మంది, షాదీముబారక్‌ 172 మంది లబ్ధ్దిదారులకు చెక్కులు అందజేశామని తెలిపారు. కోహీర్‌ మండలంలోని పీచెర్యాగడి, కోహీర్‌ పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీలు, కులమతాలకతీతంగా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అంతకుముందు ఖానాపూర్‌ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్య క్రమాల్లో జహీరాబాద్‌ తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, డిప్యూటీ తహసీల్దార్లు కిరణ్‌కుమార్‌, శ్యాం, జహీరాబాద్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కిషన్‌ పవార్‌, రైల్వే బోర్డు సభ్యుడు షేక్‌ ఫరీద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కోహీర్‌ ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్‌, తహసీల్దార్‌ కిషన్‌, సర్పంచ్‌లు రవికిరణ్‌, అతియాజావిద్‌, నర్సింహులు, సంగారెడ్డి, ఎంపీటీసీలు బక్కారెడ్డి, శుభంగీ రాహుల్‌, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ రామక్రిష్ణారెడ్డి, రామకృష్ణ, ఆనంద్‌, కలీం పాల్గొన్నారు.


logo