సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 26, 2020 , 02:28:09

పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం

పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం

  • రామలింగారెడ్డి లేకుండా చెక్కులు పంచడం కన్నీళ్లొస్తున్నయ్‌.. : మంత్రి హరీశ్‌రావు 

చేగుంట: పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రం చేగుంట సాయిబాలాజీ గార్డెన్‌లో మంగళవారం చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన 198 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి, తూప్రాన్‌ పట్టణం కేఎల్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాలకు చెందిన 200 మందికి ఎంపీ, జడ్పీ అధ్యక్షురాలు హేమలత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి రూ.2కోట్ల 23లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. రామలింగారెడ్డి రెండు వందల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబాక్‌కు స్వయంగా సంతకాలు చేశారన్నారు. ఆయన లేకుండా చెక్కులను పంచడం కన్నీళ్లు వస్తున్నాయన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆశయసాధనకు మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో కృషి చేస్తామన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉన్న ప్రజా నాయకుడు లింగన్న అని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 


logo