శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 25, 2020 , 00:42:50

పేదలకే డబుల్‌బెడ్రూం ఇండ్లు

పేదలకే డబుల్‌బెడ్రూం ఇండ్లు

సిద్దిపేట అర్బన్‌ : మొదటి మోచి భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పట్టణంలోని నర్సపూర్‌(8వ వార్డు)లో రూ.22 లక్షలతో నిర్మించుకున్న మోచి సంక్షేమ సంఘం భవనాన్ని మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి  హైదరాబాదులో మోచి సంక్షేమ సంఘం భవన నిర్మాణం చేపట్టేలా చొరవ తీసుకుంటానన్నారు. డబుల్‌బెడ్రూం ఇండ్లు రాని వారు వార్డులో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్స్‌లో వేయాలన్నారు  ఇండ్లు పక్కాగా నిరుపేదలకే చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనర్హుల ఏరివేత కోసం వార్డులో డ్రాప్‌ బాక్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. 2200 మందికి ఒకే చోట ఇండ్లు కట్టించిన ఘనత దేశంలో సిద్దిపేట మున్సిపాలిటీకే దక్కిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు,  సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఉమారాణిఐలయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి,  డీఈ లక్ష్మణ్‌  పాల్గొన్నారు.

స్టీల్‌ బ్యాంకు ప్రారంభం.. 

సిద్దిపేట అర్బన్‌ పరిధిలోని రంగదాంపల్లి(9వ వార్డు)లో  మంత్రి హరీశ్‌రావు స్టీల్‌ బ్యాంకు ప్రారంబించారు. మొదటి ఆర్డర్‌ను మంత్రి బుకింగ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. 9వ వార్డులో  ఎస్సీ కమ్యునిటీ హాల్‌లో రూ.5 లక్షలతో నిర్మించనున్న కిచెన్‌ షెడ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.20 లక్షలతో నిర్మించనున్న  రెడ్డి సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  కార్యక్రమంలో కౌన్సిలర్‌  మామిండ్ల ఉమారాణి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ నాగిరెడ్డి, నాయకులు  దబ్బెట శ్రీనివాస్‌, అంబేద్కర్‌ యువజన అధ్యక్షుడు బాలమల్లు, ప్రధాన కార్యదర్శి తిరుపతి, మహేశ్‌ పాల్గొన్నారు. logo