శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 20, 2020 , 23:51:54

లింగన్న సేవలు మరిచిపోలేనివి

లింగన్న సేవలు మరిచిపోలేనివి

  • -మండల పరిషత్‌ సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక: ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే లింగన్న మృతి తీరని లోటు అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం దుబ్బాక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పుష్పలత అధ్యక్షతనలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిపై సభలో సంతాపం తెలిపి మౌనం పాటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. సమావేశంలో జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ అస్క రవి, ఏఎంపీ చైర్మన్‌ బండి శ్రీలేఖ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాశ్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు తౌడ శ్రీనివాస్‌, ఎంపీడీవో భాస్కరాశర్మ ఉన్నారు.


logo