సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 20, 2020 , 23:52:29

టెక్నాలజీతో శిక్ష పడేలా చూడాలి

టెక్నాలజీతో శిక్ష పడేలా చూడాలి

n వినాయక చవితికి గట్టి బందోబస్తు చేపట్టాలి 

n వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర 

సిద్దిపేట టౌన్‌: టెక్నాలజీ వినియోగించి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలోని కమిషనర్‌, జిల్లా సూపరింటెండెంట్లతో నమోదైన గ్రేవ్‌ కేసులపై గురువారం డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌ కేసుల్లో ఎఫ్‌ఎల్‌ రిపోర్టు రాగానే అధికారులతో మాట్లాడి కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్‌ వేయాలన్నారు. 33 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేట్లు చేయాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని చెప్పా రు. నకిలీ విత్తనాలపై నమోదైన కేసులపై  త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌  కేసులపై సమీక్షా చేయాలన్నారు. వినాయకచవితికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, ఓఈలను వివరించారు. సమావేశంలో ఏసీపీలు శ్రీనివాస్‌, రామేశ్వర్‌, మహేందర్‌, నారాయణ, ఎస్సై పాషా, ఐటీ కోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo