సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 18, 2020 , 00:17:02

అర్ధ్దరాత్రి నుంచి మంత్రి హరీశ్‌రావు సమాలోచనలు

అర్ధ్దరాత్రి నుంచి  మంత్రి హరీశ్‌రావు సమాలోచనలు

  • సిద్దిపేటలో జరిగిన మూడు సంఘటనలపై అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి

సిద్దిపేట కలెక్టరేట్‌ : నంగునూరు మండలం దర్గపల్లి వాగులో ఇన్నోవా వాహనం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంతోపాటు గల్లంతైన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన జంగపల్లి శ్రీనివాస్‌ను కాపాడేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌, అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని విధాలా ప్రయత్నాలు  చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరిస్తున్నారు. అధికారులందరూ ఘటనా స్థలం వద్దనే ఉండి గాలిం పు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బస్వాపూర్‌ వాగులో కొట్టుకపోయిన లారీడ్రైవర్‌ ఆచూకీపై చర్యలు, మాటిండ్ల గ్రామంలోని చెక్‌డ్యాంలో కొట్టుకపోయిన రాఘవాపూర్‌కు చెందిన వెంకటేశ్‌ గల్లంతుపై  అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 


logo