బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 15, 2020 , 23:28:24

ఘనంగా పంద్రాగస్టు

ఘనంగా పంద్రాగస్టు

నర్సాపూర్‌ నియోజకవర్గంతో పాటు తూప్రాన్‌, మనోహరబాద్‌, చేగుంట, రామాయంపేట, వెల్దుర్తి తదితర మండలాల్లో..  స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాయాల వద్ద మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. నర్సాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీటవేసిందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన  మహనీయులను స్మరించుకున్నారు.

-మెదక్‌ నెట్‌వర్క్‌ 


logo