సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 15, 2020 , 00:27:16

పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

 పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

  •   ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి 

తూప్రాన్‌ రూరల్‌ :   పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ధ్యేయమని  ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌తో కలిసి శుక్రవారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, పాలకవర్గం చొరవతో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.  హరిత పట్టణంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత  కౌన్సిలర్లు , ఆయా కాలనీల ప్రజలదేనన్నారు.  సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చొరువతో పట్టణంలో  500 డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, మున్సిపల్‌ భవనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్‌, సత్యలింగం, రఘుపతి, దుర్గారెడ్డి పాల్గొన్నారు. 


logo