ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 13, 2020 , 23:26:18

డంపింగ్‌యార్డు పరిశీలన

డంపింగ్‌యార్డు పరిశీలన

సిద్దిపేట అర్బన్‌ : మండలంలోని పొన్నాల గ్రామంలో రూ.12.50 లక్షల వ్యయంతో నిర్మించిన డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలోనే మంత్రి హరీశ్‌రావు  ప్రారంభిస్తారని సర్పంచ్‌ తన్నీరు రేణుకాశ్రీనివాస్‌ తెలిపారు.  గ్రామంలో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు పనులను గురువారం ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో గ్రామంలో శ్మశాన వాటిక, ప్రాథమిక పాఠశాలలో కిచెన్‌ షెడ్‌ నిర్మాణాలు చేపట్టామన్నారు. యువకుల సౌకర్యార్థం నిర్మించిన ఓపెన్‌ జిమ్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు సంపత్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo