సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 13, 2020 , 23:26:25

ఇక ప్రజల చెంతనే కొవిడ్‌-19 పరీక్షలు

ఇక ప్రజల చెంతనే కొవిడ్‌-19 పరీక్షలు

  • n గల్లీగల్లీలో నిర్వహణ..  8గంటల్లో ఫలితాలు
  • n సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు ఐసీఎంఆర్‌ అనుమతి 
  • n మెడికల్‌ కళాశాల నూతన భవనంలో ల్యాబ్‌
  • n నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పించి.. నేను ఉన్నాననే భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు కరోనా టెస్టులు చేయడానికి మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తొలిసారిగా సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ అనుమతి లభించింది. ఇక నుంచి కరోనా వైద్య పరీక్షల నమూనాలను హైదరాబాద్‌కు పంపించే అవసరం లేకుండానే టెస్టు చేయించుకున్న 8 గంటల్లోనే సిద్దిపేట మెడికల్‌ కళాశాలలో ఫలితాలు రానున్నాయి. సిద్దిపేట మెడికల్‌ కళాశాలలోని నూతన భవనంలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను శుక్రవారం మంత్రి హరీశ్‌రావు ప్రారం భించనున్నారు.


logo