ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 12, 2020 , 02:55:03

ఈ నెల 30 వరకు ‘టీచర్స్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌'లో అప్‌డేట్‌కు అవకాశం

ఈ నెల 30 వరకు  ‘టీచర్స్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌'లో అప్‌డేట్‌కు అవకాశం

  • జిల్లాలో 3,180 మంది  ప్రభుత్వ ఉపాధ్యాయులు

మెదక్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు అందజేయాలని నిర్ణయించింది. గతేడాది పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో ‘టీచర్‌ ఇన్ఫో’లో ఇచ్చిన వివరాలను అప్‌డేట్స్‌ చేస్తూ ఈ నెల 30 వ తేదీలోగా మరికొన్ని వివరాలను ‘టీచర్స్‌ ఇన్ఫో వెబ్‌సైట్‌'లో నమోదు చేయాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది గుర్తింపు కార్డులు (ఐడెంటిటీ కార్డులు) జారీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం గానీ, విద్యాశాఖ గానీ ఐడీ కార్డులు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది ఉపాధ్యాయులకు అధికారికంగా ఐడీ కార్డులు రానున్నాయి. 

జిల్లాలో 3,180 మంది ఉపాధ్యాయులు..

జిల్లాలో 143 ప్రభుత్వ పాఠశాలలు, 15, కేజీబీవీ పాఠశాలలు,  1 ఎయిడెడ్‌ పాఠశాల, 7 మోడల్‌ పాఠశాలలు, 12 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,180 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కేబీజీవీలలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై 90 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ వివరాలు ఈ నెల 30వ తేదీలోగా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఆయా మండలాల ఎంఈవోలు ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులో వీటిని పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్‌సెట్‌లో వివరాలు ఇలా నమోదు చేసుకోవాలి...

  • n https://schooledu. telenagana.gov.in/  ISMS వెబ్‌సైట్‌లోకి ప్రవేశించాలి .
  • n రెండో దశలో ఆన్‌లైన్‌లో సర్వీసెస్‌ మెనూ క్లిక్‌ చేయాలి.
  • n మూడో దశలో టీచర్‌ ఐడీ కార్డు ఇన్ఫోను క్లిక్‌ చేస్తే.. కొత్త వెబ్‌ పేజీలోకి తీసుకెళ్తుంది.
  • n నాలుగో దశలో మీ మొబైల్‌ నెంబర్‌, ట్రెజరీ ఐడీని నమోదు చేయాలి. మీ మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైం పాస్‌ వర్డ్‌(ఓటీపీ) వస్తుంది.
  • n ఐదో దశలో మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. 
  • n ఆరో దశలో గుర్తింపు కార్డులో నమోదు చేయాల్సిన వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని నమోదు చేయాలి. 

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి 

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్రశిక్ష ఆదేశాల మేరకు యూ-డైస్‌(యూనిపైడ్‌ డిస్ట్రిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌) 2019-20 వివరాలు ప్రకారం వివిధ యాజమాన్యాల ఆధీనంలోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలను జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలలు, కేబీజీవీ, మోడల్‌ పాఠశాలలు, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులంతా ఈనెల 30లోగా నమోదు చేసుకోవాలి.

-మధుమోహన్‌, జిల్లా విద్యాశాఖ నోడల్‌ అధికారి

గుర్తింపు కార్డులు ఇవ్వడం హర్షణీయం

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డు లు ఇవ్వాలనే  ప్రభుత్వ నిర్ణ యం హర్షణీయం. ఏదైనా సందర్భాల్లో ఐడీ కార్డు అవసరమైతే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా మండల విద్యాధికారితో తయారు చేసుకుని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎలాం టి ఇబ్బంది లేకుండాప్రభుత్వమే నేరుగా అందజేయడం శుభపరిమాణం.

-మల్లారెడి,్డ ఉపాధ్యాయుడు


logo