శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 12, 2020 , 02:55:24

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 	రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

  • n మండల కేంద్రాల్లో కొవిడ్‌-19 పరీక్షలు
  • n సంగారెడ్డి జిల్లాలో  మరో 49 కేసులు నమోదు
  • n గుమ్మడిదలలో కరోనాతో  ఒకరు మృతి

సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి జిల్లాలో మంగళవా రం మరో 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డిలో 17, సదాశివపేట 2, అమీన్‌పూర్‌ 1, చెర్లగూడెం 1, ఐఐటీ, కంది 12, ముదిమాణిక్యం 2, రుద్రారం 1, చిట్కుల్‌ 2, బీడీఎల్‌ 1, చందాపూర్‌ 2, బొంతపల్లి 1, కొండాపూర్‌ మండలం సీహెచ్‌ గోపులారం 1, ఫసల్‌వాది 1, కంగ్టి మం డలం గాజులపాడ్‌ 1, ఆర్‌సీపురంలో 3 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 49 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇందులో 46 మంది హోం ఐసొలేషన్‌, ముగ్గురు ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 

జిల్లాలో ఆర్‌టీపీసీఆర్‌ నమూనాల సేకరణ..

సంగారెడ్డి జిల్లాలో 188 మంది వద్ద నుంచి ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు సేకరించామని జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. పటాన్‌చెరు ఏరియా దవాఖానలో 97 మంది వద్ద నుంచి ఆర్‌టీపీసీఆర్‌ నమూనాలు సేకరించామని, మొత్తం 285 మంది నుంచి నమూనాలు సేకరించామన్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు 332 మందికి చేశామని డాక్టర్‌ సంగారెడ్డి వెల్లడించారు.

ఐదుగురికి కరోనా పాజిటివ్‌

కల్హేర్‌: 18 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఐదు మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర  వైద్యుడు నరేందర్‌ తెలిపారు. కల్హేర్‌ పీహెచ్‌సీ పరిధిలో 8 మందికి కరోనా పరీక్షలు చేయగా, నాగదర్‌ గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సిర్గాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 10మందికి కరోనా పరీక్షలు చేయగా, నల్లవాగు గ్రామానికి చెందిన నలుగురికి పాజిటివ్‌గా తెలింది. 

గుమ్మడిదల పీహెచ్‌సీలో కొవిడ్‌ పరీక్షలు ప్రారంభం

గుమ్మడిదల: కొవిడ్‌ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌ ప్రజలకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ యాక లక్ష్మి నేతృత్వంలో ఎంపీపీ, జడ్పీటీసీ కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మం డలం కేంద్రంలో కొవిడ్‌ పరీక్షలు చేయడం అభినందనీయమన్నారు.  

బొల్లారం ఆరోగ్య కేంద్రంలో... 

బొల్లారం: మున్సిపాలిటీ పరిధిలో కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేసుకోవాలని డాక్టర్‌ రాధిక సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కొవిడ్‌-19 పరీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మొదటి రోజు 40 మందికి పరీక్షలు నిర్వహించగా,  8 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.  

మెదక్‌ జిల్లాలో 17 కేసులు 

మెదక్‌: మెదక్‌ జిల్లాలో మంగళవారం 17 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 444 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. హోం ఐసొలేషన్‌లో 275 మంది ఉండగా, 141 మంది కరోనా సోకినవారు పూర్తిగా కోలుకున్నారన్నారు. 13 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో చేగుంటలో ఒకరికి, హవేళిఘనపూర్‌లో ఒకరికి, కొల్చారంలో ఒకరికి, మెదక్‌ పట్టణంలో ఒకరికి, చిన్నశంకరంపేటలో ముగ్గురికి, పాపన్నపేటలో ముగ్గురికి, రామాయంపేటలో ఇద్దరికి, శివ్వంపేటలో ముగ్గురికి, తూప్రాన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

 ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా

గజ్వేల్‌ రూరల్‌: మండలంలోని అహ్మదీపూర్‌లో ఒకే కుటుంబంలో ఐదు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి మందులను అందజేశామని  ప్రతిభగాయత్రి తెలిపారు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.

మిరుదొడ్డిలో 13 మందికి.. 

మిరుదొడ్డి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 37 మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ సీహెచ్‌వో లింగమూర్తి తెలిపారు. 

తొగుటలో 9 పాజిటివ్‌ కేసులు

తొగుట: తొగుటలో మంగళవారం 43 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు.  

 ఇంటింటికీ థర్మల్‌ స్క్రీనింగ్‌  

మద్దూరు: సలాఖపూర్‌లో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో సర్పంచ్‌ వంగ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికీ తిరిగి థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులను చేశారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. మద్దూరు పీహెచ్‌సీ పరిధిలో 22 మందికి కరోనా టెస్టులు చేయగా, ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యాధికారులు రాజు, శ్వేత తెలిపారు.

 పీహెచ్‌సీ సిబ్బందికి కరోనా 

వెల్దుర్తి : మండల కేంద్రం వెల్దుర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మండల ఇన్‌చార్జి ప్రదీప్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా జ్వరం రావడంతో ఒకరు నగరంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో పరీక్షలు చేయించుకోగా, మరొకరు వెల్దుర్తి పీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రదీప్‌ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  వెల్దుర్తి పట్టణంలో నేటి నుంచి వారం పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచ్‌ భాగ్యమ్మఆంజనేయులు తెలిపారు. 

కరోనాతో ఒకరు మృతి

గుమ్మడిదల: మండల కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో  మృతి చెందాడు. గుమ్మడిదలకు చెందిన ఓ వ్యక్తి వారం రోజుల కింద అనారోగ్యంతో దవాఖానలో చేరారు. పరీక్షలు చేయగా, కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయనతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.


logo