గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 10, 2020 , 23:50:03

కొవిడ్‌ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొవిడ్‌ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సిద్దిపేట, కలెక్టరేట్‌ : కొవిడ్‌  బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రాంరెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏసీపీ, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో కొవిడ్‌పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కొవిడ్‌ టెస్టుల సంఖ్య పెంచాలన్నారు. స్వీయ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భౌతిక దూరం తప్పకుండా పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలన్నారు. మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.500 జరిమానా విధించాలన్నారు. శానిటేషన్‌, స్ప్రే కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలన్నారు. పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్‌ చేయాలన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. ప్రతివార్డులో ఆశవర్కర్లు, అంగన్‌వాడీలు, ఆర్పీలు, వీఆర్వో, పోలీసులతో కూడిన బృందం ఏర్పాటు చేయాలన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.


logo