బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 09, 2020 , 23:55:35

‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల రద్దీ

‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల రద్దీ

చేర్యాల :  కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దర్శనానికి ఆదివారం సుమారు 5వేల మంది వరకు భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులను కొవిడ్‌-19 నిబంధలను పాటిస్తూ స్వామి వారి దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఆలయ సిబ్బంది శానిటైజర్లను అందజేసి చేతులు శుభ్రం చేయించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ గన్స్‌తో పరీక్షలు నిర్వహించారు. ఆలయ ఈవో టంకశాల వెం కటేశ్‌ ఆదేశాల మేర కు ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, సూపరింటెండెంట్‌ నీల శేఖర్‌, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.


logo