శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 04, 2020 , 02:33:42

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  • రంజాన్‌, బక్రీద్‌ పండులకు రూ.లక్ష అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌ : రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో రంజాన్‌, బక్రీద్‌ పండుగల సందర్భంగా రూ.లక్ష చెక్కును ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. రంజాన్‌, బక్రీద్‌ పండుగలకు ప్రతీయేటా మున్సిపాలిటీ నుంచి రూ.లక్ష అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగానే రూ.లక్ష చెక్కును ముస్లింలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, మాజీ చైర్మన్‌ జగపతి, మాజీ వైస్‌ చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు సమీయొద్దీన్‌, జయరాజ్‌, కిశోర్‌, లక్ష్మీనారాయణగౌడ్‌, ఆర్‌కే శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లింగారెడ్డితో పాటు ముస్లిం మతపెద్దలు  పాల్గొన్నారు. 


logo