శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 04, 2020 , 02:33:43

గజ్వేల్‌ రోడ్లకు.. ఆకుపచ్చని తోరణాలు

గజ్వేల్‌ రోడ్లకు.. ఆకుపచ్చని తోరణాలు

గజ్వేల్‌ రూరల్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌ పట్టణంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి పచ్చని తోరణాల్లా కనువిందు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో నేడు గ్రామీణ, పట్టణ రోడ్ల వెంట ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మండలంలోని కోమటిబండ నుంచి మిషన్‌ భగీరథ ట్యాంకుల వరకు రోడ్ల వెంట మూడేండ్లుగా నాటిన మొక్కలు నేడు మానులయ్యాయి. పట్టణం  చుట్టూ నిర్మించిన రింగ్‌ రోడ్డు మధ్యలో, ఇరువైపులా నాటిన వేప మొక్కలు వృక్షాలుగా మారుతున్నాయి. గజ్వేల్‌ అర్బన్‌ పార్కులో నాటిన పూల మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.   


logo