మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 02, 2020 , 23:15:00

పల్లె ప్రకృతి వనం సూపర్‌

పల్లె ప్రకృతి వనం సూపర్‌

జిన్నారం : గడ్డపోతారంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం చాలా బాగుందని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. గడ్డపోతారం పంచాయతీలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ఆదివారం కలెక్టర్‌ పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో  25  రోజుల్లోనే పల్లె ప్రకృతి వనం పూర్తి చేసిన సర్పంచ్‌  ప్రకాశ్‌చారిని కలెక్టర్‌ అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో కలియతిరిగారు. నాటిన మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ పల్లెప్రకృతి వనంలో మొక్కనాటి నీరు పోశారు.  నిర్మాణానికి ముందు స్థలం ఎలా ఉండేదో ఫొటోలను తిలకించారు. అక్కడి నుంచి వైకుంఠధామానికి వెళ్లి పరిశీలించారు. వైకుంఠధామంలో  ఏర్పాటు చేసిన శివుని విగ్రహం బాగుందన్నారు. జిన్నారం మండలంలో నిర్మించిన వైకుంఠధామాలలో గడ్డపోతారం, కొడకంచి రెండు బాగున్నాయన్నారు. నిర్మాణాలకు సహకరించిన తహసీల్దార్‌ దశరథ్‌, ఎంపీడీవో సుమతిని కలెక్టర్‌ అభినందించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించుకోవాలన్నారు.  గడ్డపోతారం పంచాయతీలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలని సర్పంచ్‌ ప్రకాశ్‌చారి కలెక్టర్‌ను కోరగా తహసీల్దార్‌ను పిలిచి స్థలం కేటాయింపునకు ఫైల్‌ సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, ఎంపీటీసీ జనాబాయి, ఈవో నరేశ్‌బాబు, ఉపసర్పంచ్‌ మమతపెంటేశ్‌ పాల్గొన్నారు. logo