బుధవారం 05 ఆగస్టు 2020
Siddipet - Jul 31, 2020 , 23:52:38

డీఈ పత్తి వెంకటరత్నం సేవలు అభినందనీయం

డీఈ పత్తి వెంకటరత్నం సేవలు అభినందనీయం

సిద్దిపేట కలెక్టరేట్‌ : విద్యుత్‌ శాఖకు డీఈగా పత్తి వెంకటరత్నం అందించిన సేవలు అభినందనీయమని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. డీఈగా పని చేస్తున్న పత్తి వెంకటరత్నం శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు.  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిని కలెక్టరేట్‌లో వెంకటరత్నం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌తో కలిసి మాట్లాడారు. విద్యుత్‌ శాఖలో వెంకటరత్నం చేసిన సేవలను గుర్తు చేశారు. ఏఈగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకటరత్నం 29 ఏండ్ల సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పని చేశారన్నారు. సిద్దిపేటకు ఆయన 29 జూన్‌ 2018న డీఈగా బాధ్యతలు స్వీకరించి 25 నెలల పాటు సేవలందించారన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేటకు ఎలాంటి కరెంట్‌ అంతరాయం లేకుండా పలు నూతన పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రైతులకూ అందుబాటులో ఉంటూ విద్యుత్‌ సమస్యలపై వెంటనే స్పందిచారని అభినందించారు. అనంతరం సహ ఉద్యోగులు విద్యుత్‌ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. logo